Thursday, April 16, 2015

Posted by mesnehitudu 0 comments

ఫూర్తిగా చదవడానికి క్లిక్ చేయండి...

Saturday, November 27, 2010

Posted by mesnehitudu 0 comments

Hai friends అన్ని సీటీస్ఇన్ఫర్మేషన్ను అందించేందుకు నూతనంగా ప్రారంభించబడి సరికొత్త రూపంలో కస్టమర్లకుఅందించేందుకు చక్కని పేరు కావలెను. ఉదా॥ www.justdail.com విధంగా కస్టమర్లకు చేరువయ్యేలా, సైట్విజిటర్లను పేంచేలా, ప్రతి ఒక్కరికి పేరు గుర్తుండేలా చక్కని పేరు చెప్పిన వారికి రూ. 1000/- నుండి 2000/- బహుమతిఇవ్వబడును. మీ ఐడియాస్నుfreshtalent@rediffmail.com కు పంపండి. ‌ ‌‌‌ ‌

ఫూర్తిగా చదవడానికి క్లిక్ చేయండి...

Tuesday, October 26, 2010

Posted by mesnehitudu 0 comments





ఫూర్తిగా చదవడానికి క్లిక్ చేయండి...

Wednesday, February 10, 2010

Posted by mesnehitudu 0 comments

సమస్య ఒకరిదే అయినా దాని యొక్క పపిష్కారం అందరికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో మహిగ్రాఫిక్స్అనే ఫోరమ్నుస్టాట్చేసిన ఫోరమ్సభ్యులకు నా అభినందనలు మరియు థ్యాంక్స్‌ ఈ విధంగా తెలుపుకుంటున్నాను. తెలుగు సైట్లలో నాకు నచ్చిన రెండవ సైట్‌ మహీగ్రాఫిక్స్. నాకు ఫస్ట్‌ నుంచి తెలిసింది కంప్యూటర్‌ ఎరా అయినప్పటికి నా అనుభవాలను అందరితో ఈ విధంగా పంచుకోవడానికి సహకరించింది మహిగ్రాఫిక్స్ మహేష్‌ గారు. ఈ ఫోరమ్‌లో సమస్యలకు పరిష్కారమే కాకుండా ప్రతిఒక్కరు స్నేహంగా, అప్యాయంగా పలకరించడం ఆనందించదగ్గ విషయం. ఈ పోస్ట్‌ ద్వారా నేను చెప్పదలచుకుంది ఏమనగా మహిగ్రాఫిక్స్‌ ను మీరు సందర్శించి మీకు తెలిసిన మరికొంత మందికి తెలియజేయాలని... నేను ఒక సభ్యునిగా భావించి నా వంతు కృషిగా, ఎంతో సంతోషంగా ఈ పోస్ట్‌ చేస్తున్నా.


మీ
స్నేహితుడు

Free Web Counter

ఫూర్తిగా చదవడానికి క్లిక్ చేయండి...

Tuesday, February 2, 2010

Posted by mesnehitudu 0 comments

మీరు సరదాగా కవితలుగాని పాటలు రాస్తుంటారా. ఫ్రెండ్‌షిప్‌ మరియు ప్రేమ మీద పాటలు రాయగలరా. ఇంతకు ముందు ఎక్కడ వినని మరియు ఎవరి పాటలను కాపి కొట్టకుండా మీ సొంతంగా పాటను ప్రిపేర్‌ చేయగలవారు మీ వివరాలను freshtalent@rediffmail.comకు మెయిల్‌ చేయండి.

గమనిక: ఇది కొత్త పాటను వీడియో రూపంలో చిత్రికరించే ఆలోచనలో టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకోనటానికి అవకాశం మాత్రమే. మీ పాటకు ఎటువంటి రుసుము చెల్లింపము.



reliable statistics
DSL Internet Provider

ఫూర్తిగా చదవడానికి క్లిక్ చేయండి...

Wednesday, December 16, 2009

Posted by mesnehitudu 0 comments

నేనే నా ఫ్రెండ్స్కలిసి చిన్న ప్రయత్నం చేశాము. వీడియో చూసి మీ విలువైన అభిప్రాయము తెలియజేయండి.

Original Video - More videos at TinyPic ఫూర్తిగా చదవడానికి క్లిక్ చేయండి...

Friday, November 27, 2009

Posted by mesnehitudu 0 comments

మీరు ఇప్పటి దాకా అవకాశాల కోసం చుస్తుంటే కనుక ఇంక మీరు పని చేయనక్కర్లేదు. ATV చూస్తే చాలు.
ఎందుకంటే వరల్డ్‌ లోని అన్ని రకాల అవకాశాలను మీ ముందు ఉంచుతుంది ATV. మీరు జాబ్‌ చేస్తున్నా, జాబ్‌ కోసం ఎదురు చుస్తున్నా, ఉద్యోగ ఉన్నతి కోసం సలహాలు కావాలన్నా Atvలో JOb Centreని చూడండి. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మరెన్నో అవకాశాలను కూడా అందిస్తుంది ATV.


ఫూర్తిగా చదవడానికి క్లిక్ చేయండి...

Friday, September 18, 2009

Posted by mesnehitudu 0 comments

ప్రేమ అంటే ఇరుదేహాలు కలయిక కాదు విందు వినోదాలకు తిరిగి కాలాన్ని వ్యర్థం చెయ్యడం కాదు. ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకునే కానుకలు కాదు యాసిడ్పొయ్యడం, కత్తులతో నరకడం కాదు ప్రేమను వర్ణించడానికి మాటలు లేవు, ఆకాశానికి, భూమికి అనంతమైన దూరం ఉన్నా వేసవి తాపానికి భూమి బీటలు వారి తల్లడిల్లే తరుణాన భూమిపై ఉండే ప్రేమతో ఆకాశం తన గుండెల నిండా ఉండే అనురాగాన్ని మెరుపుగా మార్చి మేఘమై ఉరిమి వర్షమై కురిసి భూమిని హత్తుకొని ఓదార్చుతుంది. భూమి ఆకాశం అందించే ఆ ప్రేమవర్షిణిలో తడిసి మురిసి ముద్దయి పచ్చని చిగురును వికసింపచేసి పరిమళించే పూలతో మురిపించి తనలో అనురాగ పరిమళాలతో ఆకాశాన్ని వాటేసి అల్లేసుకుంటుంది మాటలతో చెప్పలేని ఆ ప్రేమకు మౌనసాక్షే ఈ ప్రకృతి. ఆ ఇరువురి ప్రేమ ప్రపంచంలో జీవకోటికి జీవనాధారమై మిగులుతుంది అసలైన ప్రేమంటే ఇదే.

ఫూర్తిగా చదవడానికి క్లిక్ చేయండి...

Tuesday, September 15, 2009

Posted by mesnehitudu 0 comments

మిత్రులారా, శ్రేయోభిలాషులారా మన సమాజం గురించి ఆలోచించారా?
ప్రస్తుతం సమాజం అనే తోట ఎన్నో ఆపదలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలతో నిండి ఉంది. తోటని మంచి, మానవత్వంతో నింపడానికి మనమంతా కృషి చేయాలి. మనం

చూస్తుండగానే ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, తప్పులు జరిగిపోతున్నాయి. తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. సమాజాన్ని చూసి మనం ఏమి చేయలేమా! అని ఆలోచించేవారు, భాదపడేవారు ఎక్కువే. కొందరు ఆలోచిస్తేనో, మరి కొందరు భాదపడితేనో మారదు సమాజం. అందరూ కలిసి తమ వంతు కృషి చేస్తే తప్పక మారుతుంది. అందుకోసం మనముందు జరిగే అన్నాయాలు (ఉదాహరణకు సినిమా టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నా, పోలీసుశాఖ వారు, ట్రాఫిక్ పోలీస్ వారు లంచం తీసుకుంటున్నా, పోలీసు వారి స్పందన సరిగా లేకపోయినా, ఉన్నత అధికారులు వృత్తికి ద్రోహం చేస్తున్నా, రోడ్ల మీద వాహనాలు సక్రమంగా నడపక పోయినా (నెం. నోట్ చేసుకోని), ర్యాగింగ్ మరియు ఈవ్టీజింగ్, గుళ్లలో పుజారులు కూడా అక్రమాలకు పాల్లడుతున్నారు అదే విధంగా దేవుడి ప్రసాదం విషయంలో కూడా అన్యాయమే. ఇలా మరెన్నో జరుగుతున్నాయి. సమస్యను మనం పూర్తిగా సాల్వ్ చేయకపోయినా, మీ దృష్టికి వచ్చిన అన్యాయాలను మిడియాకి కాని, సంభందిత అధికారులకు కాని తెలియజేయండి. మన వంతు కృషిలో కొంత భాగమైన నిర్వర్తిద్దాం.


సమస్యలను తెలుపుట కొరకు ఫోన్ చేయవలసిన నెంబర్లు:
1) మీడియా దృష్టికి తీసుకువెళ్లదలుచుకుంటే
TV-9 : 040-23352336, 9948290901
Inews : 040-23321000
Sakshi TV : 040-23333100

2) ఉన్నత అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల గురించి తెలుపుటకు
CBI Office : Hyderabad- 040-24732768, Vizag- 0891-2783333

3) ర్యాగింగ్ గురించి తెలియజేయుటకు
1800-180-5522, 155222 లేదా e-mail: helpline@antiragging.net

4) మనం కొన్న వస్తువు పాడయితే ఆ విషయాన్ని ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి, ఎలా మాట్లాడాలి, దేనిగురించి కేసు వేయెచ్చు, దేనిమీద వేయకూడదు, వేస్తే ఎలా వేయాలి, ఎక్కడ వేయాలి?' ఇవన్నీ సగటు మనిషికి వచ్చే నిత్య సందేహాలే. అందుకే ఆ బాధ లేకుండా ఫోన్‌ ద్వారా ఆ సేవల్ని జనం ముందుకు తీసుకొచ్చింది నేషనల్‌ కన్స్యూమర్‌ హెల్ప్‌లైన్‌. టోల్‌ ఫ్రీ నంబరు - 1800-11-4000


మిత్రులారా విషయాన్ని మీ బ్లాగ్ ద్వారా కూడా అందరికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీకామెంట్స్ను కూడా తెలియజేయగలరు.

మీ స్నేహితుడు



web tracker

ఫూర్తిగా చదవడానికి క్లిక్ చేయండి...

Monday, September 14, 2009

Posted by mesnehitudu 0 comments

అమ్మాయే సన్నగా అరనవ్వే రువ్వగా.. మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే.. అన్న పాట గుర్తుంది కదా! మర్చిపోయే పాట కాదనుకోండి. అది నిజమో కాదో తెలియదు కాని, అది నిజమేనని నెదర్లాండ్కు చెందిన పరిశోధకులు స్పష్టం చేశారు. అందమైన అమ్మాయిల్ని చూసి అబ్బాయిలు అయోమయానికి గురవుతారని వాళ్లు తేల్చి చెప్పారు.
అమ్మాయిల్ని చూడగానే, వారిని ఆకట్టుకొని, మంచి మార్కులు కొట్టేసేందుకు అబ్బాయిలు ఎక్కువ సమయం కేటాయిస్తారు. దాంతో వారి ఏకాగ్రత సడలుతుంది. పని సామర్థ్యం సన్నగిల్లుతుంది. ఇందుకు కారణం ఒకటేనట. ఈ అందమైన అమ్మాయిల దగ్గర మంచి అన్పించుకునేందుకే వీరు తమ మెదడును, శక్తిసామర్థ్యాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారట. అయితే అమ్మాయిలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నారు. అందగాడైన అబ్బాయితో మాట్లాడేటప్పుడూ వారు ఆకర్షణకు లోను కావడం లేదు. స్థిరంగా వ్యవహరించగలుగుతున్నారు. అబ్బాయిల్లా తరచూ కొత్త భాగస్వామిని వెతకాలని అమ్మాయిలు అనుకోకపోవడమే వారిలో స్థిరత్వానికి కారణం. ఈ సందర్భంలో అబ్బాయిలపై చేసిన అధ్యయనంలో అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు వారు అంత నిజాయితీగా వ్యవహరించలేదని కూడా తేలింది. ఇలా చేయడం వల్ల అబ్బాయిలు వెనుకబడే అవకాశం చాలావరకు ఉంటుంది. మరి అబ్బాయిలు మన మీద ఉన్న అపోహను తొలగిద్దామా లేక మరింత పటిస్టం చేద్దామా! ఆలోచించండి. ఉన్నత శిఖరాలను చేరుకునే మార్గాలను ఆచరించండి.

మీ స్నేహితుడు...
ఫూర్తిగా చదవడానికి క్లిక్ చేయండి...